అధ్యాత్మ సంకీర్తన
రేకు: 157-3
సంపుటము: 2-271
రేకు: 157-3
సంపుటము: 2-271
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును పచారించేరు బ్రదుకు బ్రహ్మనాటనుండియు | ॥పల్లవి॥ |
| పొద్దువొడచుటయును పొరిఁ గూఁగుటయె కాని అద్దుకొని మిగులఁగ నందేమి లేదు వొద్దికఁ బుట్టుటయును వుడుగఁ జూచుటె కాని కొద్దితోడఁ గాలమేమి గురియై నిలువదు | ॥విచా॥ |
| అన్నము భుజించేదియు నాఁకలి గొనేదెకాని యెన్నికకుఁ జెప్పిచూప నేదియు లేదు ఇన్నిటఁ దిరిగాడేది ఇంటికి వచ్చేదే కాని పన్ని తననిలుకడ భావించ లేదు | ॥విచా॥ |
| జవ్వనము మోఁచేదియు సరి ముదుసేదే కాని తవ్వి కట్టుకొనే దేది దాఁచే దేది నవ్వుతా నలమేల్మంగనాయక శ్రీవేంకటేశ రవ్వల నీ వేలికవు రక్షించు మిఁకను | ॥విచా॥ |


