అధ్యాత్మ సంకీర్తన
రేకు: 158-1
సంపుటము: 2-275
రేకు: 158-1
సంపుటము: 2-275
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| కౌసల్యానందనరామ కమలాప్తకులరామ భాసురవరద జయపరిపూర్ణరామ | ॥పల్లవి॥ |
| మునుప దశరథరాముఁడవై తమ్ములు నీవు జనించి తాటకఁ జంపి జన్నము గాచి వెనుకొని హరువిల్లు విరిచి సీతఁ బెండ్లాడి అనుమతి పరశురామునిచేఁ గైకొంటివి | ॥కౌస॥ |
| సుప్పనాతి శిక్షించి సొరిది రుషులఁ గాచి అప్పుడే ఖరదూషణాదులఁ గొట్టి చొప్పుతో మాయమృగము సోదించి హరియించి కప్పి హనుమంతు బంటుఁగా నేలుకొంటివి | ॥కౌస॥ |
| సొలసి వాలి నడఁచి సుగ్రీవుఁ గూడుక జలధి బంధించి లంక సాధించి వెలయ రావణు గెల్చి విభీషణుని మన్నించి చెలఁగితి వయోధ్యలో శ్రీవేంకటేశుఁడా | ॥కౌస॥ |


