Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 160-1
సంపుటము: 2-287
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఎవ్వరినేర్పులు జెప్ప నిందు నేది
రవ్వ సేయక జీవుల రక్షించవయ్యా
॥పల్లవి॥
తలపోసి తలపోసి ధ్యానముసేతురు నిన్ను
యెలమి నింతని నిశ్చయింపలేరు
పలుమారు నీగుణాలు పైకొని నుతింతురు
కొలఁదివెట్టుచు మీగుఱుతు లెంచలేరు
॥ఎవ్వ॥
పొదిగి పొదిగి నిన్నుఁ బూజలెల్లాఁ జేతురు
యెదుట నీశ్రీమూర్తి యెఱఁగలేరు
వెదకి వెదకి సారె విందురు నీకతలెల్లా
పదిలపు నీభ క్తి పట్టఁగలేరు
॥ఎవ్వ॥
నిక్కి నిక్కి చేతులెత్తి నీకు మెుక్కుదురుగాని
మక్కువ నీమహిమ నమ్మఁగలేరు
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నీకరుణచేత
తక్కక నిన్ను సేవించి తనియలేరు
॥ఎవ్వ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము