అధ్యాత్మ సంకీర్తన
రేకు: 2-2
సంపుటము: 1-8
రేకు: 2-2
సంపుటము: 1-8
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
ఇందిరానామ మిందరికి కుందనపుముద్ద వోగోవింద | ॥ఇందిరా॥ |
అచ్చుతనామము అనంతనామము ఇచ్చిన సంపద లిందరికి నచ్చిన సిరులు నాలుక తుదలు కొచ్చికొచ్చీ నోగోవిందా | ॥ఇందిరా॥ |
వైకుంఠనామము వరదనామము ఈకడ నాకడ నిందరికి వాకుఁ దెరపులు వన్నెలు లోకాలఁ గూకులు వత్తులు నోగోవిందా | ॥ఇందిరా॥ |
పండరినామము పరమనామము ఎండలు వాపెడి దిందరికి నిండునిధానమై నిలచిన పేరు కొండలకోనేటి వోగోవిందా | ॥ఇందిరా॥ |