అధ్యాత్మ సంకీర్తన
రేకు: 160-2
సంపుటము: 2-288
రేకు: 160-2
సంపుటము: 2-288
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| ఇన్నిటికిఁ బ్రేరకుఁడు యీశ్వరుఁడింతే పన్ని యీతనిఁ దెలిసి బ్రదుకుటే జ్ఞానము | ॥పల్లవి॥ |
| మనసునఁ బుట్టిన మంకుఁ గామక్రోధాలు పనిలేవు తనకంటేఁ బాప మంటదు పనివి తొడమ నూడి పండు తీఁగె నంటదు జనులకెల్లాఁ బ్రకృతిసహజ మింతే | ॥ఇన్ని॥ |
| చేతులారఁ జేసేటి చేకొన్న కర్మానకు ఘాతలఁ గర్తఁ గానంటే కట్టువడఁడు ఆతల నబక ముంచినట్టి వేఁడి చెయ్యంటదు జాతి దేహము మోఁచిన సహజ మింతే | ॥ఇన్ని॥ |
| వాకున నాడినయట్టి వట్టి పల్లదాలనెల్లా దాకొని పొరయనంటే తప్పులే లేవు పైకొని శ్రీవేంకటేశుబంటుకు వళకు లేదు సైకమైన హరిభక్తి సహజ మింతే | ॥ఇన్ని॥ |


