Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 160-4
సంపుటము: 2-290
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎంత వలచితివయ్యా యింతికి
చెంతనుంటే లేఁతనవ్వే సేసపాలు గావా
॥పల్లవి॥
చెలి నీపైఁ జిగురాకు చిదిమివేసితేను
వలరాజడిదమని వంచించితివి
వెలయఁగ విరహపువేళ వాఁడెక్కుఁగాక
మెలుపునఁ గదిసితే మెత్తనేకాదా
॥ఎంత॥
బిసరుహాక్షి పుప్పొడి ప్రేమ నీపైఁ జల్లితేను
వసంతుని చొక్కనుచు వసివాడేవు
వెసఁ దెరమరఁగైతే వేగమే నామెక్కుఁగాక
రసికత నొద్దనుంటే రజమే కాదా
॥ఎంత॥
అలమేలుమంగ సురటట్టే నీపై విసరితే
మలయానిలు వేఁడంటా మాటువెట్టేవు
తలఁచి శ్రీవేంకటేశ దవ్వైతే వేఁడెక్కుఁగాక
చలపట్టి కూడితివి చల్లనేకాదా
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము