అధ్యాత్మ సంకీర్తన
రేకు: 160-6
సంపుటము: 2-292
రేకు: 160-6
సంపుటము: 2-292
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| ఇవిగో మీమహిమలు యేమని పొగడవచ్చు జవళి నెంచిచూచితే సరిబేసివంటివి | ॥పల్లవి॥ |
| అంగనల చూపులు ఆరతులవంటివి కుంగక నీవు కొలువై కూచున్న వేళ చెంగట లేఁతనవ్వులు సేసపాలవంటివి కొంగులు వట్టుచు నీవు కొసరేటివేళ | ॥ఇవి॥ |
| కాంతల పలుకులెల్లా కప్పురాలవంటివి అంతలో నీవు సరసాలాడేటివేళ బంతిమోవుల యీవులు పాలకూళ్లవంటివి మంతనాననుండి నీవు మన్నించేవేళను | ॥ఇవి॥ |
| వెలఁదుల కాఁగిళ్లు విడిదిండ్లవంటివి చలముల నీ రతులు సలిపేవేళ యెలమి శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి తలఁపులవంటివన్నీ తమకపువేళను | ॥ఇవి॥ |


