అధ్యాత్మ సంకీర్తన
రేకు: 162-3
సంపుటము: 2-299
రేకు: 162-3
సంపుటము: 2-299
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఎదురుమాటలాడితి నీకు యీతప్పులు లోఁగొను నీవు పదరఁగఁ దగదు నీకు పంతములిచ్చితిఁ గావఁ గదే | ॥పల్లవి॥ |
| మునుపే నే విన్నవించితిని విన నవధరించితివి నీవు వెనక వేసుకో శరణు చొచ్చితిని విడువకు నన్ననుచు ననుఁ జూచి 'దేహి' యంటే 'నాస్తి' యనరాదు నీకు ఘనయాచకుఁడను నేను కడుదాతవు నీవు | ॥ఎదు॥ |
| వెదకి నిను వేఁడుకొంటిని విచ్చేసితివి మాయింటికి వదలఁదగదు నీభక్తి యొసఁగు నీవాఁడను పాయకుమనుచు పదిలంబుగ మొక్కిన చేతులు బలిమిఁ గోయరాదు యిదివో బంటను నేను యేలినవాఁడవు నీవు | ॥ఎదు॥ |
| మురిగి నీముద్రలు మోచితిని మన్నించితివిటు నను నీవు కరుణతోడ నాయపరాధంబులు కడపు కావుమనుచు యిరవై నీపేరు వెట్టితే నియ్యకొనక పోరాదు నరమాత్రుఁడ నే శ్రీవేంకటేశ నాయకుఁడవు నీవు | ॥ఎదు॥ |


