అధ్యాత్మ సంకీర్తన
రేకు: 163-1
సంపుటము: 2-301
రేకు: 163-1
సంపుటము: 2-301
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఆనతియ్యఁగదవే అందుకే కాచుకున్నాఁడను పూనుక నీవెంత నేర్పరివైనా భువి మనసుపేదను నేను | ॥పల్లవి॥ |
| కొలిచేమనే బంట్లు నీకుఁ గోటానఁగోట్లు గలరు నిన్నుఁ దెలిసేమనే జ్ఞానులు తెందేపలున్నారు తలఁచి వరములడిగేవారలు తలవెంట్రుకలందరు వారె యిల సందడిలో నాకొలువు యెటువలె నెక్కీనో | ॥ఆన॥ |
| పనులకుఁ బాల్పడినవారు బ్రహ్మాదిదేవతలట వినుతులు సేయఁ దొడంగినవె వేదరాసులట మునుకొని ధ్యానించువారు మునులెందరైనాఁ గలరట వినయపు నామనవి సనవులకు వేళ లెపుడు గలిగీనో | ॥ఆన॥ |
| వున్నతితోడుత నిన్ను మోఁచుటకు వున్నారు గరుఁడఁడు శేషుఁడు నీకు అన్నిటాను నీకాఁగిటిలోపల నలరీ నలమేల్మంగ యెన్నఁగ శ్రీవేంకటేశా నన్నును యేలితి వింతటిలోనే పన్నిన నా మొక్కులు నీ కేబాగులఁ జేరినో | ॥ఆన॥ |


