అధ్యాత్మ సంకీర్తన
రేకు: 163-4
సంపుటము: 2-303
రేకు: 163-4
సంపుటము: 2-303
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| సర్వేశ్వరా నీతో సరి యెవ్వరు పూర్వపువారు చెప్పఁగాఁ బూఁచి కొలిచేఁ గాని | ॥పల్లవి॥ |
| చేరి వేదములు నిన్నుఁ జెప్పఁగా వినుటే కాని నీరూపము దర్శించేవార లెవ్వరు ధారుణిలో నీయవతారాలే చూచుట ధీరత నీమహిమలు తెలిసేవా రెవ్వరు | ॥సర్వే॥ |
| భూమివారిఁ జూచి నిన్నుఁ బూజలు సేయుట గాని కామించి నీతో మాటాడే ఘను లెవ్వరు దీమసాన నీ దాసుల ద్రిష్ట మెరుగుట గాని యీమేర నీ దైవిక మెరిగే వా రెవ్వరు | ॥సర్వే॥ |
| వరములు నీ వియ్యఁగా వచ్చి సేవించుట గాని కెరలి నీమూర్తి వెదకేవా రెవ్వరు హరి శ్రీవేంకటేశా నీకరుణవారౌట గాని అరసి నిన్ను సుద్దులడిగేవా రెవ్వరు | ॥సర్వే॥ |


