అధ్యాత్మ సంకీర్తన
రేకు: 163-5
సంపుటము: 2-304
రేకు: 163-5
సంపుటము: 2-304
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఇట్టి నా వెఱ్ఱితనము లేమని చెప్పుకొందును నెట్టన నిందుకు నగి నీవే దయఁ జూడవే | ॥పల్లవి॥ |
| పాటించి నాలో నుండి పలికింతువు నీవు మాటలాడ నేరుతునంటా మరి నే నహంకరింతును నీటున లోకములెల్లా నీవే యేలుచుండఁగాను గాఁటాన దొరనంటా గర్వింతు నేను | ॥ఇట్టి॥ |
| నెమ్మదిఁ బ్రజలనెల్లా నీవే పుట్టించఁగాను కమ్మి నేనే బిడ్డలఁ గంటినంటా సంతసింతును సమ్మతి నీవే సర్వసంపదలు నొసఁగఁగాను యిమ్ముల గడించుకొంటి నివి నేనంటా నెంతు | ॥ఇట్టి॥ |
| మన్నించి యిహపరాలు మరి నీవే యియ్యఁగాను యెన్నుకొందు నాతపోమహిమ యిది యనుచును వున్నతి శ్రీవేంకటేశ నన్ను నేమి చూచేవు అన్నిటా నాయాచార్యు విన్నపమే వినవే | ॥ఇట్టి॥ |


