అధ్యాత్మ సంకీర్తన
రేకు: 164-1
సంపుటము: 2-306
రేకు: 164-1
సంపుటము: 2-306
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఎవ్వరికి యెవ్వరయ్యేరు యిందరికి నీవే దిక్కు అవ్వలనివ్వల నీ వనాథనాథుఁడవు | ॥పల్లవి॥ |
| కాయకము లందురునుఁ గార్యవశపరులే పాయని నీ వకారణబంధుఁడవు దాయగాం డ్లెవ్వరినైనాఁ దప్పించుకొనేవారే బాయటనున్నా నీవాపన్నశరణ్యుఁడవు | ॥ఎవ్వ॥ |
| అట్టె లోకమువారు అర్థకామపరులే జట్టిగొని నీవైతే సర్వదాతవు పొట్టఁబొరుగుచుట్టాలు భోజనసహాయులే నెట్టన నీవైతే మాకు నిర్వాహకుఁడవు | ॥ఎవ్వ॥ |
| అంతటా వారికివారు ఆత్మపోషకులే రంతుల నీవైతే నానారక్షకుఁడవు సంతతము శ్రీవేంకటేశా మమ్ము నేలితివి పంతమున నీవు భక్తపరిపాలకుఁడవు | ॥ఎవ్వ॥ |


