అధ్యాత్మ సంకీర్తన
రేకు: 164-3
సంపుటము: 2-308
రేకు: 164-3
సంపుటము: 2-308
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| వారివారి కర్మములే వారిఁ జుట్టుకొనఁగాను యీరీతి నీవే వారియెఱుక మాల్పితివి | ॥పల్లవి॥ |
| హిరణ్యకశిపుపాటు యెఱుఁగఁడా రావణుఁడు ధరలో హరికిఁ బగై తానూఁ బొలిసె విరసపు కంసుగతి వినఁడా దుర్యోధనుఁడు సరుగఁ దానూఁ బగై సమసినాఁడు | ॥వారి॥ |
| తెగి మురాసురుజాడ తెలియఁడా నరకుఁడు మొగిసి పోటుకుఁ బోయి మొక్కపోయను సొగిసి సోముకుదెస చూడరా దానవులెల్లా మగిడి మగడి పోరి మడిసిరి గాక | ॥వారి॥ |
| బలివోయిన తెరువు బాణుఁడు విచారించఁడా బలిమిఁ దొడరి భంగపడెఁ గాక యెలమి శ్రీవేంకటేశా యెవ్వరి నేమనవచ్చు యెలమి నిప్పటివార నెఱఁగరే కాక | ॥వారి॥ |


