అధ్యాత్మ సంకీర్తన
రేకు: 165-3
సంపుటము: 2-314
రేకు: 165-3
సంపుటము: 2-314
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
| ఇదివో నీప్రతాపము యెక్కడ చూచినాఁ దానే యెదిటి బ్రహ్మాండము యిమ్ము చాల దిందుకు | ॥పల్లవి॥ |
| పనిగొంటే భువిలో నేఁబదియే అక్షరములు కొనాడితే నీగుణాలు కోటానఁగోటి యెనసి పదునాలుగే యెడమైన లోకములు అనిశము నీవియైతే ననంతమహిమలు | ॥ఇది॥ |
| మించి నిండుకొంటే నెనిమిదియే దిక్కులు అంచల నీకతలైతే ననేకములు యెంచి చూచితేఁ గలవి పంచమహాభూతాలే ముంచిన నీమాయ తుదమొదలే లేదు | ॥ఇది॥ |
| వుపమించి తెలిసితే నొక్కటే జగము అపురూపపు నీసృష్టి అతిఘనము అపరిమితపు జీవు లణువత్రులైనాను యెపుడు శ్రీవేంకటేశ యెక్కుడు నీదాసులు | ॥ఇది॥ |


