అధ్యాత్మ సంకీర్తన
రేకు: 166-3
సంపుటము: 2-319
రేకు: 166-3
సంపుటము: 2-319
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ఆతఁడే విష్ణుం డఖిలము నడపెడి యీతల నెవ్వరి కేఁటికిఁ జింతా | ॥పల్లవి॥ |
| పుట్టించఁ బెంచఁగ పొడవెక్కించ దేహుల గట్టిగా మాఁటలాడించఁ గదలించ పట్టి వాన గురియించ పైరులు మొలపించ తిట్ట పెట్ట నొకానొకదేవుఁడు గలఁడు | ॥ఆతఁ॥ |
| అన్నపానము లొఁగ నాపదలు గడపఁగ పన్ని మాయలు భువిఁ బచరించ విన్నపాలు సురలవి విని యందరి రక్షింప వున్నతోన్నతుఁడై వొకానొకకర్త గలఁడు | ॥ఆతఁ॥ |
| కాల మక్షయము సేయ కర్మము ఫలించఁజేయ తాళుకొని మరపించఁ దలఁపించ పాలుపడి శ్రీవేంకటపతియై వేదాలుచెప్పే- యేలిక యొకానొక యీశ్వరుఁడు గలఁడు | ॥ఆతఁ॥ |


