అధ్యాత్మ సంకీర్తన
రేకు: 167-5
సంపుటము: 2-326
రేకు: 167-5
సంపుటము: 2-326
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| అపరాధిని నేనైనాను కృపగలవారికిఁ గపటములేదు | ॥పల్లవి॥ |
| సనాతనా అచ్యుతా సర్వేశ్వరా అనాది కారణ అనంతా జనార్దనా అచల సకల లోకేశ్వరా నిను మరచియున్నాఁడ ననుఁ దెలుపవయా | ॥అప॥ |
| పురాణపురుషా పురుషోత్తమా చరాచరాత్మక జగదీశా పరాత్పరా హరి బ్రహ్మాండనాయకా యిరవు నీవే యట యెఱిఁగించఁగదే | ॥అప॥ |
| దేవోత్తమా శశిదినకరనయనా పావనచరితా పరమాత్మా శ్రీవేంకటేశా జీవాంతరంగా సేవకుఁడను బుద్ధి చెప్పఁగవలయు | ॥అప॥ |


