అధ్యాత్మ సంకీర్తన
రేకు: 168-1
సంపుటము: 2-328
రేకు: 168-1
సంపుటము: 2-328
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| ఇవి సేయఁగ నే నలసుఁడ యెటువలె మోక్షం బడిగెదను వివరముతోడుత నీవు సులభుఁడవు విష్ణుఁడ నిన్నే కొలిచెదఁ గాక | ॥పల్లవి॥ |
| జపయజ్ఞదానకర్మంబులు యెంచఁగ జిరకాలఫలంబులు యెపుడుఁ బుణ్యతీర్థస్నానములు యిల పాపవిమోచనములు అపరిమిత దేవతాంతరభజనలు ఆయాలోకప్రాప్తులు వుపవాసాది నియమవ్రతములు తపోనిష్ఠకుఁ గారణంబులు | ॥ఇవి॥ |
| రవిచంద్రగ్రహతారాబలములు భువిలోఁ గామ్యఫలములు తవిలిన పంచేంద్రియనిగ్రహంబులు తనుధరులకు దుర్లభములు అవిరళ ధర్మార్థకామంబులు మఱి యైశ్వర్యములకు మూలములు అవల గ్రహణకాలానుష్ఠానము లధికఫలంబులు ఆశామయము | ॥ఇవి॥ |
| పరగ సప్తసంతానబ్రాహణతర్పణములు ఖ్యాతిసుకృతములు అరయఁ బుత్రదారక్షేత్రసంగ్రహ మందరికిని సంసారభోగము హరి నరహరి శ్రీవేంకటేశ్వరా అఖిలము నొఁసగెడి దాతవు సరుగన నీవే దయతో రక్షించఁజాలుదు వేకాలమును మమ్మును | ॥ఇవి॥ |


