అధ్యాత్మ సంకీర్తన
రేకు: 168-4
సంపుటము: 2-331
రేకు: 168-4
సంపుటము: 2-331
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| నారాయణ నీ పంపో నా భాగ్యమో ఇది పేరుకొని పిలువని పేరటమై వున్నది | ॥పల్లవి॥ |
| వుడిగినాఁ గామాదు లొక్కొక్కవ్యాజాన వచ్చీ నుడిసి నడుముచొచ్చు చుట్టాలవలె తడవకున్నాఁ గర్మాలు తమ్ముఁ దామె సేయించీ బడిబడిఁ దిరుగును బంట్లవలె | ॥నారా॥ |
| చూడకున్నా దుర్గుణాలు సొంట్లు సోదించవచ్చీ వాడవాడలఁ దలవరులవలె యేడ నున్నా లంపటాలు యెదుటనే పొలసీని జోడువాయనీక తోడునీడలవలె | ॥నారా॥ |
| తలఁచకున్నా భోగాలు తనువుతోఁ బెనఁగీని చెలరేఁగి గరిడిలో జెట్లవలె బలిమి శ్రీవేంకటేశ భావములో నీమూరితి నిలుపవే యెందుకైనా నిగిడీ నామనసు | ॥నారా॥ |


