అధ్యాత్మ సంకీర్తన
రేకు: 170-4
సంపుటము: 2-342
రేకు: 170-4
సంపుటము: 2-342
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| జపములుఁ దపములు సంధ్యాదివిధులకు నెపము నామీఁద నింతే నీకే సెలవు | ॥పల్లవి॥ |
| ఫలము నినుఁ గోరని పంతమువాఁడాఁ గాను వలెననడుగ నెంతవాఁడను నేను చెలఁగి నీవు కర్మము సేయించఁగాఁ జేసేటి- వెలలేక తెచ్చుకొన్న వెట్టివాఁడ నేను | ॥జప॥ |
| ఆస మానితిననేటి యహంకారి నేఁ గాను వాసికి నీతోఁ బెనఁగేవాఁడనా నేను వేసరకుండాఁ గట్లు విడిపించి యేలుకోఁగా దాసుఁడనై బదికేటి ధర్మపువాఁడ నేను | ॥జప॥ |
| జ్ఞానినైతిననే గర్వాచారపువాఁడాఁ గాను కానక నీపై మోపుగట్ట నోపను ఆనుక శ్రీవేంకటేశ ఆతుమ నీవుండఁగాను మోనాన నీకు మొక్కేటి మునివాఁడ నేను | ॥జప॥ |


