అధ్యాత్మ సంకీర్తన
రేకు: 171-4
సంపుటము: 2-347
రేకు: 171-4
సంపుటము: 2-347
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| శరణు శరణు వేదశాస్త్రనిపుణ నీకు అరుదైన రామకార్యధురంధరా | ॥పల్లవి॥ |
| హనుమంతరాయ అంజనాతనయా ఘనవాయుసుత దివ్యకామరూప అనుపమలంకాదహన వార్ధిలంఘన జనసురనుత కలశాపురనివాస | ॥శర॥ |
| రవితనయసచివ రావణవనాపహర పవనవేగబలాఢ్య భక్తసులభ భువనపూర్ణదేహ బుద్ధివిశారద జవసత్వవేగ కలశాపురనివాస | ॥శర॥ |
| సీతాశోకనాశన సంజీవశైలాకర్షణ ఆతతప్రతాపశౌర్య అసురాంతక కౌతుక శ్రీవేంకటేశుకరుణాసమేత శాతకుంభవర్ణ కలశాపురనివాస | ॥శర॥ |


