అధ్యాత్మ సంకీర్తన
రేకు: 172-4
సంపుటము: 2-353
రేకు: 172-4
సంపుటము: 2-353
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| సోదించి చూడఁబోతే చూచి మఱపు వో దేవదేవ మించె నోహో నీ మాయ | ॥పల్లవి॥ |
| వొక్కటే పదార్థము వూరివారెల్లాఁ జూచితే గుక్కిళ్లు మింగించి యాసకొలుపుచుండు మక్కళిం చెందరిలోని మనసులు వేరు వేరో వొక్కటో యేమనవచ్చు నోహో నీమాయ | ॥సోదిం॥ |
| ధరలో బిడ్డ వొక్కటి తల్లిదండ్రులిద్దరు తొరలింపు వేడుకలై తోఁచుచుండు పెరిగేటి పుట్టుగులు భేదమో అభేదమో వొరుల కేమనవచ్చు నోహో నీమాయ | ॥సోదిం॥ |
| కోరే మోక్ష మొక్కటే కొలచే దిద్దరినట చేరే ని న్నలమేల్మంగ శ్రీవేంకటేశ మీరిద్దరు నేకమౌ మీభావాలే వింతలో వూరకే యేమనవచ్చు నోహో నీమాయ | ॥సోదిం॥ |


