అధ్యాత్మ సంకీర్తన
రేకు: 172-5
సంపుటము: 2-354
రేకు: 172-5
సంపుటము: 2-354
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఎన్నిపాట్లఁ బడ్డాను యెవ్వరికిఁ జెప్పినాను పన్ని నీముద్రలఁ గాక పాపము వోయీనా | ॥పల్లవి॥ |
| కందువ నీపాదాలపైఁ గట్టిపెట్టినఁ గాక సందులుదూరే మనసు చక్కనుండీనా నిందలేక యేపొద్దు నిన్నే కొలిచినఁ గాక తుందుడుకు నీమాయ తొలఁగిపోయీనా | ॥ఎన్ని॥ |
| వుడివోని రుచులు నీకొప్పగించినఁ గాక బడిఁ బంచేంద్రియములు పాయనిచ్చీనా జడియక నే నీకు శరణుచొచ్చినఁ గాక వొడలిలో కామక్రోధా లుడిగిపోయీనా | ॥ఎన్ని॥ |
| నిక్కపు నాకర్మములు నీకొరకునైనఁ గాక యిక్కడ నేఁ జేసేటి హింస మానీనా పక్కన నలమేల్మంగపతివి శ్రీవేంకటేశ అక్కర నీకు మొక్కక అజ్ఞానము వోయీనా | ॥ఎన్ని॥ |


