అధ్యాత్మ సంకీర్తన
రేకు: 173-3
సంపుటము: 2-358
రేకు: 173-3
సంపుటము: 2-358
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| హరిహరి నీమహిమ లనంతములు విరతి జీవులకెల్ల నేరుపులై వున్నవి | ॥పల్లవి॥ |
| యెందరు భోగించినదో యీబ్రహ్మాండము దొల్లి అందరికిఁ దమతమదై వుండును కందువ నెవ్వరెవ్వరి కాణాచి యైనదో భూమి సందడించీఁ బంటలను సకలసస్యములు | ॥హరి॥ |
| చుట్టుక యం(యెం)దరికిని సొమ్మయినదో కాలము అట్టె అందరి ఆయుష్యమై యున్నది గట్టిగా నెవ్వరెవ్వరి కంచము కూడో యీమాయ దట్టపు సంసారముల ధర్మములై యున్నవి | ॥హరి॥ |
| ముంచి యం(యెం)దరికై నాను మోపులై వుండీ కర్మము పంచు కందరికిఁ దమ పనిపాటలై పంచుక శ్రీవేంకటేశ వారివారి బ్రదుకులు నించి నీవే యైతివి నిధినిధానమవై | ॥హరి॥ |


