అధ్యాత్మ సంకీర్తన
రేకు: 173-5
సంపుటము: 2-360
రేకు: 173-5
సంపుటము: 2-360
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
| నీవు వెట్టినట్టి చిక్కు నీవే తెలుపవలె నా వశమా తెలియ నారాయణా | ॥పల్లవి॥ |
| నీటిలోన నొకబుగ్గ నిమిషములోనఁ బుట్టి కోటిసేసినట్లుండుఁ గొంతవడి పాటించి యందే యడఁగెఁ బ్రకృతియో బ్రహ్మమో యేఁటిదో వీని యర్థ మెరిఁగించవయ్య | ॥నీవు॥ |
| ఆకసాన నొకగాలి అట్టె మ్రోయుచుఁ బొడమి లోకము సేయ విసరు లోలోనె మైకొని యందే యడఁగె మాయయో సత్యమో యీకడ నీయర్థము మా కెఱిఁగించవయ్య | ॥నీవు॥ |
| భూమిలోన మొలకలు పుట్టుచు శ్రీవేంకటేశ వాములై వెలయు నేసేవారికి ఆముక యందే యడఁగె అసత్తో ఇది సత్తో యేమో యీయర్థము మా కెరిఁగించవయ్య | ॥నీవు॥ |


