అధ్యాత్మ సంకీర్తన
రేకు: 175-2
సంపుటము: 2-370
రేకు: 175-2
సంపుటము: 2-370
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు సారపు లౌకికవిమోచనమే ముక్తి | ॥పల్లవి॥ |
| మొగిఁ బుణ్యపాపవిముక్తియే ముక్తి వెగటుఁ బ్రపంచపువిముక్తే ముక్తి తగులు సంసారబంధవిముక్తే ముక్తి జగములోఁ గలుగు యాశాముక్తే ముక్తి | ॥ఆర॥ |
| కామక్రోధాదిసంగ విముక్తే ముక్తి వేమారు రుచులపై విముక్తే ముక్తి నాముల దేహభిమానపు ముక్తే ముక్తి పామెడి కోరికలసంపద ముక్తే ముక్తి | ॥ఆర॥ |
| ముందువెనకల కర్మమోచనమే ముక్తి అంది సుఖదుఃఖభయ ముక్తే ముక్తి కందువ శ్రీవేంకటేశుఁ గని యందే శరణని విందుల నితరసేవావిముక్తే ముక్తి | ॥ఆర॥ |


