Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 176-2
సంపుటము: 2-376
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
అందుకే నేఁ జింతించెదను అచ్యుత నీశరణాగతుఁడ
సందడి నా భవ మిందువల్లనే నఫలంబాయనయ్యా
॥పల్లవి॥
వొకనీనామము వొగిఁ దలంచిన
అకలంకంబగు నాపాపంబులు అన్నియుఁ బారణే సేసే
అకటా తక్కిన అనంతనామములు
వొకట నుపవాసములున్నవోయయ్యా
॥అందు॥
పరి నీపాదము లవి రెండే
పరమును విహమును నా కొసఁగెను పయిపైఁ గృపతోడ
ధర నీయనంతకరములు తా మేమి-
సిరు లిత్త మనుచు చెలఁగీనయ్యా
॥అందు॥
ఇల నీదాస్యం బిది యొకటే
సిలుగుల భవముల జిలుగు మాన్పె నదె చిత్తము తహ దీర
యెలమిని శ్రీవేంకటేశ్వర నీ విదె
తలఁపునఁ బాయక దక్కితివయ్యా
॥అందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము