అధ్యాత్మ సంకీర్తన
రేకు: 176-4
సంపుటము: 2-378
రేకు: 176-4
సంపుటము: 2-378
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| దేహంబొకటే దేహియు నొకఁడే దాహంబెంతటఁ దనియునో తలఁపు | ॥పల్లవి॥ |
| వినుకలి వెంట వెడలీఁ దలఁపు కనుకలి వెంటఁ గదలీఁ దలఁపు కొననాలుక మదిఁ గూడీఁ దలఁపు తునిగిన యెన్నెన్ని తునకలో తలఁపు | ॥దేహం॥ |
| నయమగు చోటను నవ్వీఁ దలఁపు భయమగు చోటను బడలీఁ దలఁపు లయమై నిద్రల లవమౌఁ దలఁపు క్రియ నెందరి పంగెనయో తలఁపు | ॥దేహం॥ |
| భావించిన గతిఁ బారీఁ దలఁపు వేవేలు గతుల వెలసీఁ దలఁపు శ్రీవేంకటపతి చిత్తము లోపల నీవే తెలుపఁగ నినుఁగనె తలఁపు | ॥దేహం॥ |


