అధ్యాత్మ సంకీర్తన
రేకు: 176-6
సంపుటము: 2-380
రేకు: 176-6
సంపుటము: 2-380
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
| తొల్లి యెట్టుండునో తాను తుద నెట్టుండునో తాను యిల్లిదె నట్టనడుమ నింతేసి మెరసీ | ॥పల్లవి॥ |
| పుట్టినప్పుడే దేహి బుద్ధులేమీ నెఱఁగఁడు యిట్టె లోకులఁ జూచి యింత నేరిచె ముట్టుకొన్న యింద్రియాల ముదిసి ముదిసి రాఁగా తట్టువడి తనమేను తానే మరచె | ॥తొల్లి॥ |
| మనుజుఁడైనప్పుడే తా మాటలేమి నెరఁగఁడు జనులాడుకొనఁగానె సంగడి నేర్చె దినదినభోగాల దృష్టాంతములెల్ల అనుభవనై(???) తన కడియాలమాయ | ॥తొల్లి॥ |
| తచ్చి తాఁ గలప్పుడే దైవము నెఱఁగఁడు నిచ్చ నాచార్యునివల్ల నేఁ డెఱిఁగె అచ్చపు శ్రీవేంకటేశుఁ డంతర్యామై యుండి యిచ్చఁ గరుణించఁగాను యెక్కుడాయఁ దాను | ॥తొల్లి॥ |


