అధ్యాత్మ సంకీర్తన
రేకు: 178-1
సంపుటము: 2-386
రేకు: 178-1
సంపుటము: 2-386
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| మచ్చికఁ బ్రపంచపుమరుపే బ్రహ్మానంద- మిచ్చల తానే గురి ఇన్నిటికి నాత్మ | ॥పల్లవి॥ |
| లోచూపే వెలిఁబడి లోకమయి తోఁచీని ఆచూపే మరలితే నది మోక్షము యేచి రెంటికి నెడమధ్య మీమేను తాచి వొకఁడే గురి తానాయ నాత్మ | ॥మచ్చి॥ |
| మన సొక్కచోట నుండి మాయలై తోఁచీని మనసు తనందుంటే మహి యోగ్యము వెనకమునుపులకు వీడుఁబట్టు జననము కొనమొదలునుఁ దానే గురియాయ నాత్మ | ॥మచ్చి॥ |
| బయలు దునిసి బహుభానులై తోఁచీని బయ లొక్కట యఖండపరిపూర్ణము నయమై శ్రీవేంకటనాథు కరుణచేత జయమై తానున్నచోనే సతమాయ నాత్మ | ॥మచ్చి॥ |


