అధ్యాత్మ సంకీర్తన
రేకు: 178-3
సంపుటము: 2-388
రేకు: 178-3
సంపుటము: 2-388
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అంతరాత్మ హరి గలఁడంతే చాలు యెంతకెంత చింతించనేలా వెఱవ | ॥పల్లవి॥ |
| వెనక జన్మపు గతి వివరించి నే నెరగ అనుగు మీఁదటి జన్మమది యెఱగ ననిచి యీ జన్మము నానాఁట దెలిసేము యెనసి యీ భవములకేలా వెఱవ | ॥అంత॥ |
| నిన్నటి దినము కత నిమిషమై తోఁచీని కన్నుల రేపటి చేఁత కానఁగరాదు పన్ని నేఁటి దినము మున్ను నోఁచినట్లే యెన్నఁగ నెందుకునైనానేలావెఱవ | ॥అంత॥ |
| పరము నిహము నేఁ బైకొన నా యిచ్చగాదు హరి శ్రీవేంకటపతి యఖిలకర్త శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది యిరవైతి నింకా నాకేలా వెఱవ | ॥అంత॥ |


