అధ్యాత్మ సంకీర్తన
రేకు: 182-2
సంపుటము: 2-410
రేకు: 182-2
సంపుటము: 2-410
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| కరుణానిధివి గాన కాచితేనేమో కాని సరికి బేసికి నిన్ను అరయఁ జోటున్నదా | ॥పల్లవి॥ |
| కాయములోపలి నిన్నుఁ గని మని కొలువక ఆయపుఁగర్మమె బ్రహ్మ మని వుంటిని చీయని నాచేఁతకు నే సిగ్గువడుండుట గాక ఆయమేమైనా నిన్ను నడుగఁ జోటున్నదా | ॥కరు॥ |
| సకలచైతన్యుఁడవై సరి నాలో నుండఁగాను వికటపు విషయాలవెంటఁ బారితి వొకరు రక్షించఁగా వేరొకరిపాలైన నాకు తుకతుకలేకాక దూరఁగఁ జోటున్నదా | ॥కరు॥ |
| పట్టి శ్రీవేంకటగిరిఁ బ్రత్యక్షమై యుండఁగాను ఇటు నటుపై వైకుంఠ మేల కోరేను దిట్టనై నానేరమి నే తెలిసి నవ్వుట యింతే ఇట్టె నీచిత్తము గాక యెంచఁగఁ జోటున్నదా | ॥కరు॥ |


