అధ్యాత్మ సంకీర్తన
రేకు: 183-2
సంపుటము: 2-416
రేకు: 183-2
సంపుటము: 2-416
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| అవియు నాకుఁ బ్రథమాచార్యులు తవిలి యీనెపము మిముఁ దలఁపించుఁ గాన | ॥పల్లవి॥ |
| ధనవాంఛ మతిలోనఁ దగిలినప్పటివేళ దనుజారి మీమీఁద దలఁపు గలుగు పొనిగి భయదుఃఖములఁ బొరలినప్పటివేళ పనివూని మీమీఁది భక్తి గలుగు | ॥అవి॥ |
| చెలఁగి పాపములు మించినవేళ హరి మీ- నలువు నామోచ్చారణంబు గలుగు బలిమి భవరోగముల బడలినప్పటివేళ వలుమారు మీసంప్రార్థనలు గలుగు | ॥అవి॥ |
| ఇన్నిటాఁ దొలఁగి మిము నెరిఁగి కొలిచినవేళ మన్ననల పరిణామంబు గలుగు వున్నతపు శ్రీవేంకటోత్తముఁడ మిము నెదుటఁ గన్న యీవేళ సౌఖ్యంబులే కలుగు | ॥అవి॥ |


