అధ్యాత్మ సంకీర్తన
రేకు: 184-2
సంపుటము: 2-422
రేకు: 184-2
సంపుటము: 2-422
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| నాకు నీవు గలవు హరి నా లోపలనుండి పైకొని యిన్నియు బదుకనీవయ్యా | ॥పల్లవి॥ |
| పసిగొని రుణానుబంధము కొలఁదే పసులునుఁ బడతులు బహుసుతులు వసముగావు తమవంతులు దీరిన పసగా నవియే బదుకనీవయ్యా | ॥నాకు॥ |
| పెనగొని భటులకుఁ బెట్టిన కొలఁదియు పనులునుఁ గీర్తులు పంతములు అనువులు దప్పును అవి గడమైతే పనివడి యివియే బదుకనీవయ్యా | ॥నాకు॥ |
| కడుసంపదలును కాలము కొలఁదే బడిబడిఁ జవులై ఫలియించు యెడపక శ్రీవేంకటేశుఁ డిచ్చె నివే పడసితి మివియును బదుకనీవయ్యా | ॥నాకు॥ |


