అధ్యాత్మ సంకీర్తన
రేకు: 185-3
సంపుటము: 2-428
రేకు: 185-3
సంపుటము: 2-428
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| నిక్కమైన నాలోని నెలవు గానలేను దిక్కు నీవే హరి నాతెలి వేఁటితెలివి | ॥పల్లవి॥ |
| నీటిలో మునిఁగి వచ్చి నిర్మలుఁడ ననుకొందు గాఁటమై యావేగి లేచి కానందును తేటల ఆ దేహమే దిష్టము ఆనేనే పాటిలేని భావపు నాబదు కేఁటిబదుకు | ॥నిక్క॥ |
| యెన్న నొక బంటు నేలి యేలికే నే ననుకొందు పన్ని నే నొకరిఁ గొల్చి బంట నందును మున్నిటి నామనసె మొదలి నాపుట్టుగే యిన్ని వికారాల నాయెరు కేఁటియెరుక | ॥నిక్క॥ |
| కాంచనము చేతనుంటే కలవాఁడ ననుకొందు పెంచి యొకవేళ నేఁ బేద నందును కంచుమాయఁ బొరలఁగాఁ గాచితి శ్రీవేంకటేశ కొంచిన యిన్నాళ్లు నాగుణ మేఁటిగుణము | ॥నిక్క॥ |


