అధ్యాత్మ సంకీర్తన
రేకు: 185-4
సంపుటము: 2-429
రేకు: 185-4
సంపుటము: 2-429
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| అరు దరుదు నీమహి మతిమానుషము చూడ పురుషోత్తమను దివ్యపుర జగన్నాథా | ॥పల్లవి॥ |
| పసులఁ గాచే దేడ బ్రహ్మ నుతియించు టేడ సిసువౌ టేడ నాలుగుచేత లేడ కొసరి వేలనే యేడ కొండగొడగెత్తు టేడ వసమా నిన్నుఁ బొగడ వరజగన్నాథా | ॥అరు॥ |
| జనవేష మేడ పారిజాతము దెచ్చిన దేడ తనివెన్న ముచ్చి మేడ దైవికమేడ పని బండిబోయిఁడేడ బాణుని నరకు టేడ వినఁ గత నీమహిమ విష్ణు జగన్నాథా | ॥అరు॥ |
| కమ్మి రోలఁ గట్టు టేడ గరుడవాహన మేడ దొమ్మి భద్రసుభద్రుల తోఁబుట్టు వేడ చిమ్ముల నిలగిరిని (?) శ్రీవేంకటాద్రిమీఁద- నుమ్మడి నిరవుకొంటివో జగన్నాథా | ॥అరు॥ |


