అధ్యాత్మ సంకీర్తన
రేకు: 185-6
సంపుటము: 2-431
రేకు: 185-6
సంపుటము: 2-431
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| జయమంగళము నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి | ॥పల్లవి॥ |
| శరణాగతపారిజాతమా పొరి నసురలపాలి భూతమా అరుదయున సృష్టికి నాదిమూలమా వో- హరి నమో పరమపుటాలవాలమా | ॥జయ॥ |
| సకలదేవతాచక్రవర్తి వెకలివై నిండిన విశ్వమూర్తి అకలంకమైన దయానిధి వికచముఖ నమో విధికి విధి | ॥జయ॥ |
| కొలచినవారల కొంగుపైఁడి ములిగినవారికి మొనవాఁడి కలిగిన శ్రీవేంకటరాయా మలసి దాసులమైన మాకు విధేయా | ॥జయ॥ |


