Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 186-4
సంపుటము: 2-435
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
ధరలో "నెద్భావం తద్భవ"తనెఁ గాన
హరిమయమే జగమంతాను
॥పల్లవి॥
మహి నెదిటివారందు మలినము దలఁచిన
తహతహ మనసే తా మలినము
వహి నెదిటందు భావనము భావించిన
బహువిధములఁ దానూ భావనమే
॥ధర॥
యెక్కువ నెదిటిపాపా లెంచి నిందించేటి-
నిక్కపునాలుక తానే నిందితము
వొక్కటై యెదిటిపుణ్యా లుగ్గడించి ఘనమంటే
దక్కిన పుణ్యపు జిహ్వ తానూ ఘనమే
॥ధర॥
సారె శ్రీవేంకటపతి సగుణము దలఁచిన
సారపు జీవుఁడు దాను సగుణమే
నేరుపుల నాతని నిర్గుణము దలఁచిన
తారతమ్యములులేని తానూ నిర్గుణమే
॥ధర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము