అధ్యాత్మ సంకీర్తన
రేకు: 186-5
సంపుటము: 2-436
రేకు: 186-5
సంపుటము: 2-436
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| ఎందాఁక నిద్ర నీకిదె తెల్లవారెఁ గదె యిందిరారమణ నీవిటు మేలుకొనవే | ॥పల్లవి॥ |
| కమలనాభుఁడ నీకు గంగాదినదులెల్ల- నమర మొకమజ్జనం బాయితము సేసె తమితోడఁ గనకాద్రి తానే సింహాసనము విమలమై యొప్పె నదే విచ్చేయవే | ॥ఎందాఁ॥ |
| హరి నీకు నజుఁడు పంచాంగంబు వినిపించ నిరతమగు వాకిటను నిలిచినాఁడు సురలు నీయవసరము చూచుకొని కొలువునకు సరవి నాయిత్తపడి సందడించేరు | ॥ఎందాఁ॥ |
| కామధేనువు వచ్చె కనుఁగొనుటకై నీకు శ్రీమహాదేవి నీచేలాగు కదివో యీమహిమ శ్రీవేంకటేశ నీకే చెల్లె కామించి యన్నియునుఁ గైకొంటివిపుడు | ॥ఎందాఁ॥ |


