అధ్యాత్మ సంకీర్తన
రేకు: 186-6
సంపుటము: 2-437
రేకు: 186-6
సంపుటము: 2-437
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| రామా రామభద్ర రవివంశరాఘవ యేమి యరుదిది నీకింతటివానికిని | ॥పల్లవి॥ |
| నాఁడు రావణు తలలు నఱకిన లావరివి నేఁడు నాపాపములు ఖండించరాదా వాఁడిప్రతాపముతోఁడ వారిధిగట్టిన నాటి- వాఁడవిట్టె నామనోవార్ధిఁ గట్టరాదా | ॥రామా॥ |
| తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి కినిసి నాయింద్రియాల గెలువరాదా యెనసి హరుని విల్లు యెక్కుపెట్టి వంచితివి ఘనము నాదుర్గుణము కడు వంచరాదా | ॥రామా॥ |
| సరుస విభీషణుఁడు శరణంటేఁ గాచితివి గరిమ నే శరణంటిఁ గావరాదా తొరలి శ్రీవేంకటేశ దొడ్డుగొంచ మెంచనేల యిరవై లోకహితానకేదైనా నేమీ | ॥రామా॥ |


