అధ్యాత్మ సంకీర్తన
రేకు: 187-2
సంపుటము: 2-439
రేకు: 187-2
సంపుటము: 2-439
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| తలఁపులో కొట్టగొన దైవమే వున్నాఁడు తలఁచిన రూపులెల్లా తా నయ్యీనయ్యా | ॥పల్లవి॥ |
| కలలో ప్రపంచము కంటి నే నొకటి వెలినున్న ప్రపంచవిధివలెనే కలనున్నవాఁడ నేనే వెలి నన్నువాఁడ నేనే తెలి(య?) మాబతుకు రెంట దెప్పరములయ్యా | ॥తలఁ॥ |
| దేహమీఁడ నుండఁగానే దిక్కులకేఁగీ మనసు దేహముతో దిక్కులెల్లాఁ దిరిగినట్టే దేహములోవాఁడ నేనే దేహముపై వాఁడ నేనే వోహో మాజన్మములో నొకటి రెండయ్యా | ॥తలఁ॥ |
| కన్నులెదుట శ్రీవేంకటపతిఁ గొలిచెద కన్నుమూసి యాతనినే కమ్మర భావించెదను కన్నులోపల నేనే కన్నులవెలిని నేనే వున్నతి నీరెండును వొక్కటాయనయ్యా | ॥తలఁ॥ |


