అధ్యాత్మ సంకీర్తన
రేకు: 187-3
సంపుటము: 2-440
రేకు: 187-3
సంపుటము: 2-440
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| చాలునిదే నా నిరతి సకలసామ్రాజ్యము నాలోని పని యెంతైనా నాకుఁ గలదు | ॥పల్లవి॥ |
| వడఁబడి పరులిండ్లవాకిలి గాచే నేను వడి నాలో హరియున్న వాకిలి గాచేను బడి నొకరిఁ గొలిచి బహురాజ్యమేలే నేను యెడ నామనోరాజ్యమింతా నేలేను | ॥చాలు॥ |
| చేరి యొరులకుఁ బనిసేసి యలసే నేను సారె నాయోగాభ్యాసాన నలసేను అరసి నే నడుగఁగ నన్యులిచ్చేయీవులు తారి పూర్వకర్మాదిదైవమే యిచ్చీని | ॥చాలు॥ |
| అందు సంతోషమే ఫల మిందు సంతోషమే ఫల- మందును మాయాకల్పిత మిందును మాయే అందు నిందు శ్రీవేంకటాధీశుఁడే కర్త అందైతేఁ బరతంత్రుఁడిందు నే స్వతంత్రుఁడ | ॥చాలు॥ |


