అధ్యాత్మ సంకీర్తన
రేకు: 187-6
సంపుటము: 2-443
రేకు: 187-6
సంపుటము: 2-443
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| వానికి ముదుల యిచ్చి వద్దని మానుపవే శ్రీనారాయణ వీనిచేత నే వేసరితి | ॥పల్లవి॥ |
| నీకల్పితములే యీనిఖిలేంద్రియములు యీకడ నీయింద్రియాల నెట్టు గెలువఁగవచ్చు నీకడ నిన్నే కొలిచి నీయప్పణ దెచ్చి వానిఁ బైకొని చోఁపుటగాక బలిమా రాచాజ్ఞతో | ॥వాని॥ |
| నీపంపునఁ గప్పిన నిజమైన మాయ యిది మాపాటివారెల్లా మహి నెట్టు దాఁటవచ్చు మీపాదాలే కొల్చి మీయనుజ్ఞ గొని దాని పైపైఁ దోయుటగాక బలిమా రాచాజ్ఞతో | ॥వాని॥ |
| శ్రీవేంకటేశ నీచిక్కులే యీపుట్టుగులు నీవు సేసే చేఁతలకు నే నెట్టు దొలఁగవచ్చు నీవొద్ద శరణంటి నీయానతినే వాని భావించి తోసితిఁగాక బలిమా రాచాజ్ఞతో | ॥వాని॥ |


