అధ్యాత్మ సంకీర్తన
రేకు: 189-6
సంపుటము: 2-455
రేకు: 189-6
సంపుటము: 2-455
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| మరిగితి నేమి సేతు మగిడి నేనెందు వోదు సరుస దైవమ నీకే శరణు చొచ్చేను | ॥పల్లవి॥ |
| తల్లి గోపించి మొత్తినఁ దనయుఁడు తల్లికొంగే యెల్లగాఁ బట్టి పెనఁగి యేడిచినట్టు వెల్లవిరై హరి నీవు విషయాలఁ జిక్కించితే ఇల్లిదే నిన్నుఁ దలఁచి ఇటు దూరే నేను | ॥మరి॥ |
| కన్నతండ్రి బాలునిఁ జంకంబెట్టి దించితేను కొన్నేసి విలుచు ముద్దుగునిసినట్టు వున్నతి నాలోనుండి వూరకే మాయ నాపై బన్నితే నిన్నే సొలసి పగటులాడేను | ॥మరి॥ |
| దైవము దాతవు నీవే తల్లివి దండ్రివి నీవే భావించి చేపట్టితే నీ బంట నే నింతే శ్రీవేంకటేశ నీవు చేకొని రక్షించఁగాను జీవుఁడనయిన నేను చెలఁగి మొక్కేను | ॥మరి॥ |


