అధ్యాత్మ సంకీర్తన
రేకు: 190-2
సంపుటము: 2-457
రేకు: 190-2
సంపుటము: 2-457
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఈతనిమూలమెపో యిలఁగల ధనములు యీతఁడు మాకు గలఁడు యెంత లేదు ధనము | ॥పల్లవి॥ |
| విరతి మాధనము విజ్ఞానమే ధనము మరిగిన తత్వమే మా ధనము పరము మా ధనము భక్తే మా ధనము మా- కరిరాజవరదుఁడే కైవల్యధనము | ॥ఈత॥ |
| శాంతమే మా ధనము సంకీర్తనే ధనము యెంతైనా నిశ్చింతమే ఇహధనము అంతరాత్మే మా ధనము హరిదాస్యమే ధనము యింతటా లక్ష్మికాంతుఁ డింటిమూలధనము | ॥ఈత॥ |
| ఆనందమే ధనము ఆచార్యుఁడే ధనము నానాటఁ బరిపూర్ణమే ధనము ధ్యానమే మా ధనము దయే మా ధనము పానిన శ్రీవేంకటాద్రిపతియే మా ధనము | ॥ఈత॥ |


