అధ్యాత్మ సంకీర్తన
రేకు: 190-3
సంపుటము: 2-458
రేకు: 190-3
సంపుటము: 2-458
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
| నీమాయ కల్లగాదు నిజము దెలియరాదు కామించి హరి నీ వొక్కఁడవే నిజము | ॥పల్లవి॥ |
| చచ్చేటి దొకమాయ హరిఁ బుట్టేదొకమాయ మచ్చుమేపులసిరులు మాయలో మాయ వచ్చేటి దొకమాయ వచ్చిపోయ్యే దొకమాయ కచ్చుపెట్టి హరి నీ వొక్కఁడవే నిజము | ॥నీమా॥ |
| పొద్దువొడచేది మాయ పొద్దుగుంకే దొకమాయ నిద్దురయు మేల్కనేది నిండుమాయ వొద్దనే సుఖము మాయ వొగి దుఃఖ మొకమాయ గద్దరి శ్రీహరి నీ వొక్కఁడవే నిజము | ॥నీమా॥ |
| కూడేటి దొకమాయ కూడి పాసే దొకమాయ యేడ నేర్చితి శ్రీవేంకటేశుఁడ నీవు వేడుక నీశరణంటి విడిపించు మీమాయ వోడక వెదకితి నీ వొక్కఁడవే నిజము | ॥నీమా॥ |


