అధ్యాత్మ సంకీర్తన
రేకు: 190-4
సంపుటము: 2-459
రేకు: 190-4
సంపుటము: 2-459
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురతవిన్నాణరాయ సుగుణకోనేటిరాయ | ॥పల్లవి॥ |
| సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకలవినోదరాయ వర వసంతములరాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ కొండల కోనేటిరాయ | ॥తిరు॥ |
| గొల్లెతల వుద్దండరాయ గోపాలకృష్ణరాయ చల్లు వెదజాణరాయ చల్లఁ బరిమళరాయ చెల్లుబడి దర్మరాయ చెప్పరాని వలరాయ కొల్లలైన భోగరాయ కొండల కోనేటిరాయ | ॥తిరు॥ |
| సామసంగీతరాయ సర్వమోహనరాయ ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ కామించి నిన్నుఁ గోరితే గరుణించితివి నన్ను శ్రీమంతుఁడ నీకు జయ శ్రీవేంకటరాయ | ॥తిరు॥ |


