అధ్యాత్మ సంకీర్తన
రేకు: 190-5
సంపుటము: 2-460
రేకు: 190-5
సంపుటము: 2-460
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
| అన్నిటా శాంతుఁడైతే హరిదాసుఁడు దానే సన్నుతిఁ దానే పో సర్వదేవమయుఁడు | ॥పల్లవి॥ |
| అత్తల మనసు యింద్రియాధీనమైతేను చిత్తజుఁడనెడివాఁడు జీవుఁడు దానే కొత్తగాఁ దనమనసే కోపాన కాధీనమైతే తత్తరపు రుద్రుఁడునుఁ దానే తానే | ॥అన్ని॥ |
| భావము వుద్యోగముల ప్రపంచాధీనమైతే జీవుఁడు బ్రహ్మాంశమై చెలఁగుఁ దానే కావిరి రేయిఁబగలు కన్నుల కాధీనమైతే ఆవలఁ జంద్రసూర్యాత్మకుఁడు దానే | ॥అన్ని॥ |
| కోరికఁ దనబ్రదుకు గురువాక్యాధీనమైతే మోరతోపులేని నిత్యముక్తుఁడు దానే ఆరయ శ్రీవేంకటేశుఁ డాతుమ ఆధీనమైతే ధారుణిలో దివ్యయోగి తానే తానే | ॥అన్ని॥ |


