అధ్యాత్మ సంకీర్తన
రేకు: 190-6
సంపుటము: 2-461
రేకు: 190-6
సంపుటము: 2-461
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఇహమెట్టో పరమెట్టో ఇఁక నాకు సహజమై హరియే శరణము నాకు | ॥పల్లవి॥ |
| చిత్తమిది యొకటే చింత వేవేల సంఖ్య పొత్తుల హరిఁ దలఁచఁ బొద్దులేదు జొత్తుల కన్నులు రెండు చూపులైతే ననంతాలు తత్తరించి హరిరూపు దగ్గరి చూడలేదు | ॥ఇహ॥ |
| చేతు లివియు రెండే చేష్టలు లక్షోపలక్ష యీతల హరిఁ బూజించ నిచ్చ లేదు జాతి నాలిక వొకటే చవులు కోటానఁగోటి రీతి హరినామ ముచ్చరించ వేళ లేదు | ॥ఇహ॥ |
| వీనులివి రెండే వినికి కొలదిఁలేదు వూని హరిభక్తి విన బుద్ధిలేదు యీనటన శ్రీవేంకటేశుఁడిటు చూచినను తానే యేలె నిఁకఁ దడఁబాటు లేదు | ॥ఇహ॥ |


