అధ్యాత్మ సంకీర్తన
రేకు: 191-3
సంపుటము: 2-464
రేకు: 191-3
సంపుటము: 2-464
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| కలిగె మాకు నిది కైవల్యం కలకాలము హరికథాశ్రవణం | ॥పల్లవి॥ |
| అచింత్య మద్భుత మానందం ప్రచురం దివ్యం పావనం సుచరిత్రం శ్రుతిశోభితం అచలంబిదివో హరికీర్తనం | ॥కలి॥ |
| నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితం హర భవదూరం పరమ మంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం | ॥కలి॥ |
| సులభం సుకరం శోకనాశనం ఫలదం లలితం భయహరణం కలితం శ్రీవేంకటపతిశరణం జలజోదరనిచ్చ స్తోత్రం | ॥కలి॥ |


