అధ్యాత్మ సంకీర్తన
రేకు: 191-6
సంపుటము: 2-467
రేకు: 191-6
సంపుటము: 2-467
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| హరియు నొక్కఁడే గురి ఆత్మలో నొక్కటే గురి విరివి నెంత చదివినా వేరుగాఁ బొయ్యీనా | ॥పల్లవి॥ |
| అందరిచూపులు నొక్కటైనందుకు గురి యెందూఁ గొండ కొండేకాక యితరముగాఁ జూచేరా అందరిరుచులు నొక్క టైనందుకు గురి చెంది తీపు తీపే కాక చేఁదుగాఁ జేకొనేరా | ॥హరి॥ |
| వొప్పుగా నందరివూర్పు లొక్కటైనందుకు గురి కప్పుర మదేకాక కస్తూరిగా మూఁకొనేరా యెప్పుడూ నిందరి వినికేకమైనందుకు గురి తిప్పి తిట్టు తిట్టేకాక దీవెనగా వినేరా | ॥హరి॥ |
| యీరీతి నిందరిచిత్త మేకమైనందుకు గురి మేరతో సూర్యోదయము మించి రేతిరయ్యీనా తేరి శ్రీవేంకటపతి దేవుఁడైనందుకు గురి కోరినవారి వరాలే కొంగుపైఁడి గాదా | ॥హరి॥ |


